నడి రోడ్డుపై మొసలి

by Sridhar Babu |   ( Updated:2025-03-21 16:24:20.0  )
నడి రోడ్డుపై మొసలి
X

దిశ, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో పాకాల వాగు వద్ద పెనుగొండకు వెళ్లే రహదారిపై శుక్రవారం రాత్రి మొసలి ప్రత్యక్షమవడం కలకలం సృష్టించింది. పాకాల వాగులో మొసళ్లు ఉండటంతో ప్రస్తుతం నీరు లేక ఎండిపోవడంతో వాగులో ఉండాల్సిన మొసలి రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపై ఉన్న మొసలిని గమనించిన ప్రయాణికులు కాసేపు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపైనే కొన్ని నిమిషాల పాటు ఉండి పక్కన ఉన్న పొలాల్లోకి వెళ్లిందని ప్రయాణికులు తెలిపారు.

Next Story

Most Viewed