- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Good News : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. ఒంటిపూట బడి సమయాల్లో మార్పు

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు(Students) భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం(Odisha Govt) ఒంటిపూట బడుల(Half Day School)పై కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు, కళాశాలలను ఉదయం 6:30 నుంచి 10:30 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా శాఖ మంత్రి నిత్యానంద గోండ్ తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. వేసవి ముగిసే వరకు ఈ ఏర్పాటు అమలులో ఉంటుందని.. పిల్లలకు నీరు, ఓఆర్‌ఎస్ అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. ఒడిషా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో ఏపీ(AP)లో కూడా ఒంటిపూట బడుల సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన స్కూళ్లలో ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు ఉంటాయని.. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఈ సమయపాలన కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఇక తెలంగాణ(Telangana)లో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కాగా.. విద్యా సంవత్సరం ముగిసే వరకు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నడుస్తాయని విద్యాశాఖ వెల్లడించింది. అయితే, పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 1:00 గంట నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు తరగతులు జరుగుతాయని.. ప్రభుత్వ పాఠశాలల్లో 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు.