- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News : కర్నూల్ లో చికెన్ షాపుల ముందు జనం క్యూ.. కారణం ఇదే!
దిశ, వెబ్ డెస్క్ : కర్నూలులో చికెన్ షాపుల ముందు జనం క్యూ కట్టి మరీ చికెన్ కొనడానికి పోటీ పడ్డారు. ఆదివారం ఉదయం నుంచే వందల కొద్ది జనాలతో షాపులు కిక్కిరిసి పోయాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. కర్నూల్ పట్టణంలోని మద్దూర్ నగర్ లో ఉన్న షమీర్, సుభాన్ అనే చికెన్ షాపుల నిర్వాహకులు ఆదివారం కిలో చికెన్ వంద రూపాయలకే అమ్ముతున్నట్టు ప్రకటించారు. ఇంకేముందీ.. విషయం ఆ నోటా ఈ నోటా పట్టణం అంతా పాకడంతో భారీగా జనం చికెన్ కొనడానికి షాపుల ముందు లైన్లు కట్టారు. రెండు గంటలకుపైగా ఆ రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ జాం అయింది అంటేనే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కార్తీక మాసం అయినప్పటికీ చికెన్ కొనడానికి వినియోగదారులు పోటీ పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు కలగ జేసుకొని ట్రాఫిక్ సరిదిద్దాల్సి వచ్చింది. దీనిపై చికెన్ షాపుల నిర్వాహకులు మాట్లాడుతూ.. దీనికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవని.. ఏదోకరోజు ఇలా తక్కువ ధరకు చికెన్ విక్రయించాలి అనుకున్నామని, ఆదివారం అయితే ఎక్కువమంది కొంటారు అనే ఉద్దేశంతో అమ్మామని తెలియజేశారు.