Hindi Tutors : ఎలాన్ మస్క్ కంపెనీలో హిందీ ట్యూటర్ జాబ్స్.. గంటకు రూ.5,400

by Hajipasha |
Hindi Tutors : ఎలాన్ మస్క్ కంపెనీలో హిందీ ట్యూటర్ జాబ్స్.. గంటకు రూ.5,400
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీ భాషా నిపుణులకు కొత్త ఉద్యోగ అవకాశాలను క్రియేట్ చేస్తోంది. అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌(Elon Musk)కు చెందిన ఏఐ కంపెనీ(AI company) ‘ఎక్స్ ఏఐ’ ఇప్పుడు హిందీ, ఇంగ్లిష్ భాషలు రెండూ వచ్చిన అభ్యర్థుల కోసం వెతుకుతోంది. అర్హులైన వారిని తమ కంపెనీలో ఏఐ ట్యూటర్లు(Hindi tutors)గా నియమించుకోనుంది. ఈ జాబ్‌లో చేరేవారు.. ఎక్స్ ఏఐ కంపెనీ డెవలప్ చేసే ఏఐ మోడల్‌కు హిందీ భాషలో ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. హిందీలో నిత్యం వినియోగించే అన్ని రకాల వేలాది పదాలను ఏఐ మోడల్‌కు నేర్పాలి. ఆయా పదాలను టైప్ చేసినా.. వాయిస్‌లో చెప్పినా గుర్తుపట్టేలా ఏఐ మోడల్‌ను సంసిద్ధం చేయాలి.

మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ జాబ్‌కు ఎంపికయ్యే అభ్యర్థులు.. వారికి నచ్చిన చోటు నుంచి పని చేయొచ్చు. హిందీతో పాటు చైనీస్, ఫ్రెంచ్, అరబిక్ భాషల నిపుణుల నుంచి ప్రస్తుతం ఎక్స్ ఏఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. హిందీలో జర్నలిజం నేపథ్యంతో పాటు కంటెంట్ రైటింగ్ అనుభవం, భాషపై పట్టు, టెక్నికల్ పదాలను ఇంగ్లిష్ నుంచి హిందీలోకి అనువదించే నైపుణ్యం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అనుభవం, అర్హతలు, పనితీరు ఆధారంగా గంటకు రూ.2,900 నుంచి రూ.5,400 దాకా పేమెంట్ ఇస్తారు. వారంలో ఐదు పనిదినాలే. మెడికల్ బెనిఫిట్స్ లభిస్తాయి.

Advertisement

Next Story

Most Viewed