Farmers protest : ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల నిరసన

by Naveena |
Farmers protest : ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల నిరసన
X

దిశ,మక్తల్: నియోజకవర్గంలోని కోల్పూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో రైతులు నిరసన (Farmers protest ) తెలిపారు. తమ ధాన్యం కొనుగోలు చేయాలని బుధవారం నిరసన దిగారు. కృష్ణానదిపరివాహక ప్రాంతంలోని కోల్పూర్ ,మదిపల్లి రైతులు ధాన్యం కోతలు కోసి ఇరువై రోజులవుతుంది. ఈసంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర తెలిపి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించండంతో..రైతులు సంతోష పడ్డారని కానీ..వరి కోతలు జరిగి రోజులుకావస్తున్న అగ్రికల్చర్ అధికారులు కన్నెత్తి చూడలేదని రైతులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో రైతులు వరి కోతలు ముగిసిన విషయం సంబంధిత అధికారులకు నివేదించిన.. ధాన్యాన్ని బస్తాలకు నింపేందుకు గన్ని బ్యాగులను సరఫరా చేయలేదన్నారు. ప్రభుత్వాన్ని నమ్ముకొని వేచి చూడడం వృధా అని.. పక్క రాష్ట్రానికి వెళ్లి అమ్ముకోవాలని సిద్ధపడుతున్నామని రైతులు అన్నారు. ఇప్పటికైనా పాలక ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతంలో రైతులు కొతలు కోసి నిల్వ ఉంచిన ధాన్యాన్ని కొనుగోలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోతుల రఘు. యాపల్ దీన్నే కిష్టప్ప .బుర్ర కృష్ణయ్య ఈడ్గి కృష్ణయ్య. కాపు లింగ రెడ్డి .అంజప్ప బంగి శివలింగం .నరసింహ.మహేష్ పూజారి .బంగి సాయప్ప. గణేష్ . గడ్డం అయ్యప్ప. రాజు .గొల్ల శేఖర్. పాల్గొన్నారు .

Advertisement

Next Story

Most Viewed