Collector : రహదారి భద్రతతో జీవితానికి రక్షణ

by Sridhar Babu |
Collector : రహదారి భద్రతతో జీవితానికి రక్షణ
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రహదారి భద్రతతో జీవితానికి రక్షణ లభిస్తుందని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి (Collector Mikkilineni Manuchoudhary)అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ లో డిస్ట్రిక్ట్ లెవల్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ, ఇతర ప్రధాన రహదారులు కలిసే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు (Speed ​​breakers)ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా దట్టంగా పెరిగిన మొక్కల కొమ్మలను తొలగించాలన్నారు.

దుద్దెడ, కుకునూరుపల్లి, గౌరారం, వంటిమామిడి గ్రామాల వద్ద ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా రెయిలింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రహదారుల నుంచి నిర్దేశిత దూరం పాటించి వైన్ షాప్ (Wine shop)లు ఉండేలా ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు పక్కనే బస్సులు ఆపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. సమావేశంలో పోలీసు కమిషనర్ అనురాధ, సిద్దిపేట ఆర్డీఓ సదానందం, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మూర్తి, జిల్లా రవాణా శాఖ అధికారి కొండల్​రావు, ఏసీపీలు మధు, పురుషోత్తం, సతీష్, సుమన్ కుమార్, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, మురళి, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే, జైల్స్, ఆర్టీసీ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed