రాష్ట్రానికి అధిక ఆదాయం హైదరాబాద్ నుండే : బిజేపి నేత కిషన్ రెడ్డి

by M.Rajitha |
Union Minister Kishan Reddy Asks CM KCR for Evidence Of Cloudburst
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రానికి హైదరాబాద్ ఆదాయ తరవు అన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆదివారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి హైదరాబాద్ నగరం అతి ముఖ్యమైనది అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో హైదరాబాద్ స్థానం గొప్పదని కొనియాడారు. గత ఇరవై, ముప్పై ఏళ్లుగా నగరం గణనీయంగా అభివృద్ది చెందిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, విద్యా, రక్షణ, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు పురోగతిలో దూసుకుపోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడక పోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్ని రకాల సహాయం చేయడానికి ముందుటుందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాకు తెలియ జేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ఆదాయంలో 80% ఒక్క హైదరాబాద్ నగరం నుండే వస్తుందని అన్న ఆయన.. ఆ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల అవసరాలకు మాత్రం వినియోగించడం లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజల బాగోగులు వదిలి వారి స్వంత ప్రయోజనాలకు రాష్ట్ర ఆదాయాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.

Next Story

Most Viewed