తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల

by M.Rajitha |
తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) డీఎస్సీ(DSC) పరీక్షల తుది కీ(Final Key)ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడదలవగా.. జూలై 18 నుండి ఆగస్ట్ 5 వరకు ఆన్లైన్ పద్దతిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది విద్యాశాఖ. ఈ పరీక్షలకు 2,45,263 మంది హాజరయ్యారు. వీటికి సంబంధించిన ప్రైమరీ కీ ఆగస్ట్ 13న విడుదలవగా.. తుది కీని నేడు విడదల చేశారు. తుది కీని పాఠశాల విద్యాశాఖ వారి అధికారిక వెబ్సైట్ https://schooledu.telangana.gov.in/ISMS/ నందు అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు. ఇక డీఎస్సీ ఫలితాలను అతి త్వరలోనే ప్రకటిస్తామని విద్యాశాఖ ఈ సందర్భంగా వెల్లడించింది.

Advertisement

Next Story