తెలుగు ప్రజల అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యం: కాసాని

by GSrikanth |   ( Updated:2023-04-11 14:48:27.0  )
తెలుగు ప్రజల అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యం: కాసాని
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ వారి గుండెల్లో ఉంటుందని రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. త్వరలోనే టీడీపీకి పూర్వ వైభవం రావడం ఖాయమన్నారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్లో మిర్యాలగూడ, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను నేటికీ ప్రజలు మర్చిపోలేదన్నారు.

ఓట్ల కోసం నేటి ప్రభుత్వాలు అవసరం లేకున్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలపై అప్పుల భారం మోపుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల పనితీరును చూసిన ప్రజలు మాకు మళ్ళీ తెలుగుదేశం పాలనలో మంచి రోజులు రావాలని కోరుకుంటున్నారన్నారు. సమావేశంలో మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు కాసుల సత్యం, జడ రాములు యాదవ్, ధీరవత్ మాన్యా నాయక్, ముక్కెర అంజిబాబు, ఎండీ జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.

Also Read..

జిల్లా ఆసుపత్రిలో క్యాత్ లాక్ సేవలు: మంత్రి హరీష్ రావు

Advertisement

Next Story