- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి కేటీఆర్‌పై హెచ్‌ఆర్సీలో T- కాంగ్రెస్ కంప్లైంట్
దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్ జన్మదినం సందర్భంగా చొప్పదండి నియోజకవర్గంలో చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిందని టీపీసీసీ వైస్‌ప్రెసిడెంట్ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పిల్లలతో పనిచేయించడం ఏమిటనీ ప్రశ్నించారు. ఈ అంశంపై నేషనల్ చిల్డ్రన్కమిషన్కూ వెళ్తామన్నారు.
మొక్కలు చనిపోతున్నాయని చర్యలు తీసుకుంటున్న కలెక్టర్లు.. చిన్న పిల్లలను ఇబ్బంది పెడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే, సర్పంచులు 15 రోజుల పాటు పిల్లలను ఇబ్బంది పెట్టి కేటీఆర్ అనే పదం వచ్చే విధంగా కింద కూర్చోబెట్టి ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బలహీన వర్గాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారని, అలాంటి వారితో వర్క్చేయించడం ఎంత వరకు కరెక్ట్? అని మండిపడ్డారు.
మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. కేటీఆర్ మెప్పు పొందేందుకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు దిగజారుతున్నారన్నారు. కేటీఆర్ జన్మదినం పేరుతో హంగు, ఆర్భాటాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, అధికార ప్రతినిధులు సంధ్యారెడ్డి, అయోధ్య రెడ్డి, లింగం యాదవ్, వచన్ కుమార్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.