- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ.. మోడీ కోసం వెళ్తారా.. వెళ్లరా?
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. దీంతో గత కొంత కాలంగా ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సుముఖత చూపడం లేదు. సందర్భం ఏదైనా టార్గెట్ మోడీ అనే పాయింట్ తో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. వరుసగా ప్రధాని కార్యక్రమాలకు కేసీఆర్ డుమ్మా కొడుతున్నారు. అయితే తాజాగా మరోసారి మోడీ అధ్యక్షత జరగనున్న మీటింగ్ కు కేసీఆర్ కు ఆహ్వానం అందడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సారైనా ప్రధాని మీటింగ్ కు కేసీఆర్ హాజరు అవుతారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో సస్పెన్స్ గా మారింది.
పొలిటికల్ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మీటింగ్
జీ-20 దేశాల కూటమికి ఇటీవలే భారత్ అధ్యక్షత బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. దేశం తరపున జీ-20 కూటమికి తదుపరి కార్యాచరణకు చైర్మన్‌గా ప్రధాని నరేంద్రమోదీ వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఇండోనేషియా రాజధాని బాలిలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించిన నేపథ్యంలో చేపట్టాలనుకుంటున్న కార్యక్రమాలపై చర్చించేందుకు డిసెంబర్ 5 సాయంత్రం రాష్ట్రపతి భవన్ వేదికగా పార్లమెంటులో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోడీ భేటీ కాబోతున్నారు. ఈమేరకు అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు కేంద్రం ఆహ్వానాలు పంపింది. ఈ సందర్భంగా చేపట్టాలనుకుంటున్న కార్యక్రమాలపై చర్చించేందుకు భేటీ అవుతున్నామని, ఈ భేటీ ముఖ్య ఉద్దేశ్యం, అజెండాను వివరించి తప్పక హాజరుకావాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈనెల 15న అన్ని పార్టీల అధ్యక్షులకు లేఖలు రాశారు.
కేసీఆర్ హాజరవుతారా?
ఈ భేటీ ఉద్దేశాలను వివరిస్తూ మీటింగ్ కు తప్పక హాజరుకావాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రులు అర్జున్‌రాం మేఘ్వాల్, మురళీధరన్‌లు వివిధ పార్టీ నేతలతో మాట్లాడి ఆహ్వానించారు. కాంగ్రెస్, బీఎస్పీ, టీడీపీ, టీఆర్ఎస్ సహా15 పార్టీల అధ్యక్షులతో మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడి ఆహ్వానించగా, లెప్ట్ సహా మరి కొన్ని పార్టీల ప్రధాన నేతలతో మురళీధరన్, మిగతా పార్టీలకు చెందిన మరి కొంతమందితో అర్జున్‌రాం మేఘ్వాల్ మాట్లాడి ఆహ్వానించారు. అయితే గత కొంత కాలంగా బీజేపీతో నేరుగా పొలిటికల్ ఫైట్ చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మోడీ సమావేశాలను అవాయిడ్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం ఇచ్చే కార్యక్రమానికి మోడీ తెలంగాణకు వస్తే ఈ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితే కొనసాగింది. మోడీ తెలంగాణకు వస్తే కేసీఆర్ ఆహ్వానించలేదు.
సీఎం కేసీఆర్ చివరి సారిగా 2021 సెప్టెంబర్ లో ఢిల్లీలో కలిశారు. అప్పటి నుంచి ప్రధానిని ఇప్పటి వరకు కలవలేదు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో అవకాశం వచ్చినా మోడీతో భేటీ అయ్యేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. మోడీనే కాదు కేంద్రంలోని పెద్దలను కలిసేందుకు సైతం కేసీఆర్ ఇష్టపడం లేదనే విమర్శలు ఉన్నాయి. గత సెప్టెంబర్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి కేసీఆర్ దూరంగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య బిగ్ ఫైట్ నడుస్తున్న క్రమంలో డిసెంబర్ 5న జరగబోయే జీ20 పై జరగబోయే సమావేశానికైనా కేసీఆర్ హాజరు అవుతారా లేక ఎప్పటిలాగే స్కిప్ చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.