- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్వే ఫలితాలు విడుదల.. తెలంగాణలో అధికారం ఏ పార్టీదంటే..?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదునుపెట్టాయి. పార్టీలు మారుతున్న కీలక నేతలు, ఎన్నికల ప్రచార హోరు జోరందుకుంది. ఇప్పటికే మెజారిటీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ రెండు లిస్టులను ఇప్పటికే విడుదల చేసింది. రెండు జాబితాలు విడుదల చేసిన బీజేపీ సైతం అభ్యర్థుల మూడో జాబితాపై తుది కసరత్తు చేస్తోంది.
ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయో తెలియజేస్తూ ‘జనతా కా మూడ్’ సర్వే ఫలితాలు విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం.. బీఆర్ఎస్ 72-75 స్థానాలు, కాంగ్రెస్ 31-36 స్థానాలు, బీజేపీ 6-7 స్థానాలు, ఎంఐఎం 4-6 స్థానాలు గెలుచుకుంటాయని సర్వే తెలిపింది. ఇక, బీఆర్ఎస్‌కు 41 శాతం, కాంగ్రెస్‌కు 34 శాతం, బీజేపీకి 14 శాతం, ఎంఐఎంకు 3 శాతం ఓట్ షేర్ వస్తుందని సర్వే పేర్కొంది. మొత్తం ఒక లక్షా ఇరవై వేల శాంపిల్స్ సేకరించినట్లు ఈ సర్వే వెల్లడించింది.