- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక రంగాల్లో రాణించాలి : మంత్రి పొన్నం
దిశ, హుస్నాబాద్ ; ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర ,సాంకేతిక రంగాల్లో రాణించాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ ప్రభుత్వ బాలురు, బాలికల పాఠశాలలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో రోబోటిక్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్,ఇంగ్లీష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ , పాఠశాల మొబైల్ యాప్ లను సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి తో కలిసి మంత్రి ప్రారంభించారు. సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి చొరవతో రోబోటిక్ ల్యాబ్ సోహం అకాడమీ , కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణ సంస్థ , సైన్స్ ల్యాబ్ ఇన్ఫినిటీ వైద్య ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఉపయోగపడే ల్యాబ్ లను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.విద్యార్థులు కంప్యూటర్ లను ఉపయోగించుకోవాలని, ఇంగ్లీష్ ల్యాబ్ ద్వారా భాషా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని, కమ్యూనికేషన్ స్కిల్స్, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో ఆటలు ఆడిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.హుస్నాబాద్ బాయ్స్ పాఠశాల నుండి జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన అశ్వద్ ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... భవిష్యత్ లో పెరుగుతున్న సాంకేతికత నేపథ్యంలో సైన్స్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్,కంప్యూటర్ ల్యాబ్ ను ఉపయోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు తాము ఏ రంగంలో తీసిపోమని చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని స్కూల్ లలో సైన్స్ ,కంప్యూటర్ ,రోబోటిక్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
సిద్దిపేట లో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఉంటుందని కాంపిటీషన్ లో హుస్నాబాద్ నుండి ప్రతి స్కూల్ పాల్గొనాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. ప్రైజ్ లు గెలుచుకోవడానికి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 3 మండలాల స్కూల్ లు ముందుండాలని తెలిపారు. అందుకు సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలని తెలిపారు. తల్లిదండ్రులు జెడ్ పి హెచ్ ఎస్ హుస్నాబాద్ పేరు మీద యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని విద్యార్థుల మార్కులు, పాఠశాల కార్యక్రమాలు తల్లిదండ్రులు నేరుగా తెలుసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వ పాఠశాల కు కొటక్ మహీంద్రా సంస్థ వారి సహకారంతో 25 లక్షల తో త్వరలోనే ఆడిటోరియం నిర్మిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్ లో విద్యార్థులకు కావాల్సిన అవసరాలు తీర్చే బాధ్యత తనదని ,మంచిగా శ్రమ పడి సాంకేతిక విద్య నిరంతర అభ్యసనం , క్రీడలు ,సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు.
ఈనెల 14 నుంచి డిసెంబర్ వరకు ఉదయం ,సాయంత్రం స్టేడియంలో ఉచిత యోగ క్లాస్ లు ఏర్పాటు చేశామని పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. ల్యాబ్ లను ఉపయోగించుకొని అన్ని రంగాల్లో రాణించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ... కొత్తగా ప్రారంబించిన సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్ లను ఉపయోగించుకోని భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని సూచించారు.మొబైల్ యాప్ ద్వారా టీచర్స్ , పేరెంట్స్ విద్యర్ధుల స్టడీస్ పై నేరుగా అబ్జర్వ్ చేయగలరని తెలిపారు. విద్యార్థులు నేర్చుకోవడం కమ్యూనికేషన్ స్కిల్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత , జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, కౌన్సిలర్లు ,ఆర్డీవో , ఎంఈవో ,మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో , నిర్మన్ సంస్థ ప్రతినిధి ఉషకర్ , ఇన్ఫినిటీ వైద్య ఫౌండేషన్ ప్రతినిధి కృష్ణా రెడ్డి , సోహం అకాడమీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.