- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బస్టాండ్లలో కాలం చెల్లిన వస్తువులు అమ్మితే కఠిన చర్యలు : మంత్రి పొన్నం
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రయాణికులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. న్యూఇయర్ సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జూబ్లీ బస్టేషన్ లోని ప్రయాణికులతో ముచ్చటించారు. జేబీఎస్ శానిటేషన్ సిబ్బందితో మంత్రి మాట్లాడారు. బస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. బస్టాండ్ లోని షాపులను పరిశీలించి, నాణ్యమైన ఆహర పదార్థాలను ఉంచాలని, కాలం చెల్లిన ఆహార వస్తువులు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టాల్స్ లో ఎక్కువ ధరలకు వస్తువులు అమ్మరాదని, ఎవరైనా అమ్మినట్టు ఫిర్యాదులు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
డ్రింకింగ్ వాటర్, ఫ్లాట్ ఫాంలను పరిశీలించారు. ఫ్లాట్ ఫాంలపై డిస్ ప్లే బోర్డులు కనిపించే విధంగా ఉండాలని అధికారులకు సూచించారు. రోడ్డు భద్రతా మాసంలో భాగంగా డ్రైవర్ లతో మాట్లాడి రోడ్డు భద్రత పై అవగాహన కల్పించాలన్నారు. క్యాంటీన్ లో ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడారు. క్యాంటీన్ లో నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. జూబ్లీ బస్టాండ్ లో ఉన్న కార్గో సెంటర్ ను మంత్రి పరిశీలించి, ఉద్యోగులకు పలు సలహాలు ఇచ్చారు. ప్రతి రోజు ఇక్కడి నుంచి వెళ్లే ప్రయాణికుల సంఖ్య కార్గో పార్సిల్స్, ఇతర వివరాలను ఉద్యోగులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి, ఇతర అధికారులు ఉన్నారు.