మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్.. తప్పుడు ఆరోపణలపై లీగల్ నోటీసులు జారీ

by Mahesh |   ( Updated:2024-09-26 13:05:07.0  )
మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్.. తప్పుడు ఆరోపణలపై లీగల్ నోటీసులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)కు "సృజన్ రెడ్డి(Srujan Reddy) లీగల్ నోటీసులు(legal notices) జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం శోభ కన్స్ట్రక్షన్‌కు ఇచ్చిన అమృత్ పథకం టెండర్లలో అవినీతి జరిగిందని చేసిన ఆరోపణలపై ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. కాగా కొద్ది రోజుల క్రితం.. తెలంగాణ ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ వెంటనే విచారణ చేపట్టి.. నిజాలను బహిర్గతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, టోచన్ సాహూ‌లకు గత శుక్రవారం లేఖలు రాశారు. కేంద్రం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.1500 కోట్ల టెండర్లు సీఎం సొంత బావమరిదిసృజన్ రెడ్డికి చెందిన శోధ కంపెనీ(Shobha constraction)కి అర్హతలు లేకున్నా కట్టబెట్టారని.. వెంటనే ఈ ఆరోపణలపై కేంద్రం విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. కాగా ఈ ఆరోపణలపై సృజన్ రెడ్డి కేటీఆర్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా, వెబ్ సైట్ నుండి కంటెంట్ తొలిగించాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని సృజన్ రెడ్డి కేటీఆర్ ను ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed