- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొలువుదీరిన కొత్త కొత్వాళ్లు.. డ్రగ్స్‌పై ఉక్కుపాదం
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: డ్రగ్స్విక్రయించేవారు.. వినియోగించేవారు ఇకపై ప్యాకప్చెప్పుకోవాలని హైదరాబాద్పోలీస్కమిషనర్కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. మాదక ద్రవ్యాల దందా చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. సినీ పరిశ్రమలో ఉన్న కొందరు తరచూ డ్రగ్పార్టీలు చేసుకుంటున్న విషయం తన దృష్టిలో ఉందన్నారు. త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. అప్పటికీ డ్రగ్పార్టీలు చేసుకోవటం మానేయక పోతే ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్కొంత అవహేళనకు గురైందని చెబుతూ ఇకపై ఇలా ఉండదన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.
బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్లో హైదరాబాద్కమిషనర్గా ఇన్ఛార్జ్ కమిషనర్ సందీప్ శాండిల్య నుంచి బుధవారం శ్రీనివాస్‌రెడ్డి కొత్వాల్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల సమాజంలో అన్ని వర్గాల ప్రజలను పట్టి పీడిస్తున్నాయని చెప్పారు. ఎక్కువగా పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, ఫాంహౌస్‌లలో డ్రగ్స్వాడకం జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. సినీ పరిశ్రమలో కూడా డ్రగ్స్వాడకం గణనీయంగా ఉన్నట్టు తెలిసిందన్నారు. డ్రగ్స్అమ్మకందారులపై ఎంత కఠిన చర్యలు తీసుకుంటామో వాటిని వినియోగిస్తున్న వారిపై కూడా అంతే స్థాయి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
డిమాండ్ ఉంటే సప్లై ఉంటుందని చెబుతూ డిమాండ్లేకుండా చేయటమే తమ లక్ష్యమని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా వదిలి పెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. డ్రగ్పెడ్లర్స్..డ్రగ్కన్స్యుమర్స్లీవ్అవర్సిటీ అండ్‌ది స్టేట్అని హెచ్చరించారు. సమాజంలో ఉన్న చెడ్డవారికే ఈ హెచ్చరిక అని వ్యాఖ్యానించారు. చట్టాలను గౌరవించే వారితో పోలీసులు ఎప్పుడూ స్నేహ పూర్వకంగానే ఉంటారన్నారు. శాంతిభద్రతలను కాపాడటానికి ఇలాంటి వారి సహకారం తీసుకుంటూ ముందుకు వెళతామన్నారు. హైరరాబాద్విశ్వనగరంగా రూపుదిద్దుకొంటోందని చెబుతూ ఇలాంటి సిటీల్లో ప్రధానంగా మూడు సవాళ్లు ఉంటాయన్నారు. అందులో ఒకటి క్విక్రెస్పాన్స్కావటమని చెప్పారు. ఏదైనా సంఘటన జరిగితే వీలైనంత తక్కువ సమయంలో నేరస్థలానికి చేరుకున్నపుడు పరిస్థితులను వెంటనే అదుపులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నారు. సాంకేతిక, ఇతరత్రా అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుని శాంతిభద్రతలను కాపాడుతామన్నారు. మహిళల పట్ల జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేయటానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
ఈవ్టీజింగ్వంటి సమస్యల పరిష్కారానికి షీ టీమ్స్మరింత సమర్థవంతంగా పని చేసేట్టు చూస్తామని చెప్పారు. హైదరాబాద్పొరుగునే ఉన్న సైబరాబాద్, రాచకొండ కమిషనర్లతో సమన్వయాన్ని ఏర్పాటు చేసుకుని పని చేస్తామన్నారు. నా శక్తి సామర్థ్యాలను గుర్తించి హైదరాబాద్పోలీస్కమిషనర్గా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 450 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్నగరం అన్ని రకాల ప్రజలకు ఆలవాలమన్నారు. మినీ భారత్‌గా చెప్పే హైదరాబాద్ప్రతిష్టను మరింత ఇనుమడింప చేసేలా పోలీసింగ్చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు సీపీ (లా అండ్ఆర్డర్) విక్రమ్‌సింగ్‌మాన్, అదనపు సీపీ (స్పెషల్‌బ్రాంచ్) విశ్వప్రసాద్, జాయింట్‌కమిషనర్(అడ్మిన్) పరిమళ హనా నూతన్, జాయింట్సీపీ (క్రైమ్స్, సిట్) గజరావు భూపాల్, వెస్ట్జోన్డీసీపీ జోయెల్‌డేవిస్, ఎస్ఎంఐటీ డీసీపీ రాధేష్‌మురళి తదితరులు పాల్గొన్నారు.
నిష్పక్షపాతంగా.. చట్టబద్దంగా పని చేస్తాం : సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి
ఐటీతోపాటు పలు ప్రముఖ సంస్థల కార్యాలయాలు ఉన్న సైబరాబాద్ కమిషనురేట్ ఎంతో ప్రత్యేకమైనదని అవినాష్‌మహంతి అన్నారు. ఈ క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిష్పక్షపాతంగా, చట్టబద్దంగా పని చేస్తామన్నారు. సైబరాబాద్కమిషనర్గా బుధవారం స్టీఫెన్రవీంద్ర నుంచి అవినాష్‌మహంతి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించటానికి తమ వద్ద ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటామన్నారు. అతి పెద్ద సమస్యగా మారిన సైబర్నేరాలను అరికట్టటానికి ప్రత్యేక దృష్టిని సారిస్తామన్నారు. ప్రజలకు అండగా మేమున్నామన్న భరోసాను కల్పిస్తామని చెప్పిన అవినాష్‌మహంతి అన్ని రకాల కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామన్నారు.
కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. దీని కోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పారు. ఇక, మాదక ద్రవ్యాల దందాను కఠినంగా అణచి వేస్తామన్నారు. డ్రగ్స్ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపై దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. డిసెంబర్31న నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ జరుపుకునే వేడుకలను పోలీసు నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని చెప్పారు. పబ్బులు, ఫాంహౌస్‌లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెడతామన్నారు.
మహిళా సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు.. రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు
మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని రాచకొండ కమిషనర్సుధీర్బాబు చెప్పారు. డ్రగ్స్‌సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా విస్తృతస్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టిని సారిస్తామన్నారు. రాచకొండ కమిషనరేట్‌లో బుధవారం ఆయన ఇంతకు ముందు కమిషనర్డీ.ఎస్. చౌహాన్నుంచి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ శాంతిభద్రతల పరరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. దీని కోసం సివిల్, ఏఆర్బెటాలియన్, ట్రాఫిక్తదితర విభాగాల సిబ్బందిని సమన్వయం చేసుకుంటామని చెప్పారు. నానాటికీ పెరిగిపోతున్న సైబర్‌నేరాలకు కళ్లెం వేయటానికి పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్‌నేరాలపట్ల ప్రజల్లో అవగాహన కల్పించటానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. గతంలో రాచకొండ అదనపు కమిషనర్పని చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన కమిషనరేట్పరిధిలోని అన్ని ప్రాంతాలపై సంపూర్ణ అవగాహన ఉన్నట్టు చెప్పారు.
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లతో సమన్వయం ఏర్పరుచుకుని శాంతిభద్రతల రక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేట్టు చూస్తామని చెప్పారు. భూ సంబంధిత నేరాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తామని తెలిపారు. రౌడీషీటర్లపై నిఘా ఉంటుందన్నారు. శాంతిభద్రతల రక్షణకు అవసరమైతే రిటైర్డ్అధికారుల సలహాలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో రాచకొండ అదనపు కమిషనర్తరుణ్జోషి, మల్కాజిగిరి డీసీపీ జానకీ, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఎల్బీనగర్డీసీపీ సాయి శ్రీ, ఉమెన్‌సేఫ్టీ వింగ్డీసీపీ ఉషా విశ్వనాథన్, రోడ్డు సేఫ్టీ డీసీపీ శ్రీబాల, క్రైమ్స్డీసీపీ అరవింద్, అడ్మిన్డీసీపీ ఇందిర తదితరులు పాల్గొన్నారు. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత సుధీర్‌బాబు మర్యాద పూర్వకంగా ఇన్ఛార్జ్డీజీపీ రవిగుప్తాను ఆయన కార్యాలయంలో కలిశారు.