- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
‘HIT-4’ కోసం రంగంలోకి దిగనున్న నందమూరి స్టార్ హీరో.. నెట్టింట హైప్ పెంచుతున్న న్యూస్

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) మనందరికీ సుపరిచితమే. ‘అష్టా చమ్మా’(Ashta Chamma) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్‌తో పాటు అవార్డులు కూడా కైవసం చేసుకున్నాడు. సినిమాల్లో నాచురల్‌గా నటించడం అతని స్టైల్. ఏ సీన్ అయినా ఇట్టే జీవించేస్తాడు. ఇక ఇతని స్టైల్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్ళి చేసుకున్న ఈ హీరోకి ప్రస్తుతం ఒక బాబు. అలా ఓ పక్కా మ్యారీడ్ లైఫ్‌ను మరో పక్క సినిమాలతో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇక నాని చాలా సినిమాల్లో నటించి హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నిర్మాత(Producer)గా మారి మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా రీసెంట్‌గా శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి(Megastr Chiranjeevi)తో ఓ మాస్ సినిమా అనౌన్స్ చేసిన విషయం విదితమే. మరి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాని నిర్మాతగా కూడా మంచి స్థాయికి ఎదుగుతారని ఫ్యాన్స్, నెటిజన్స్ భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాని స్వీయ నిర్మాణంలో ‘హిట్-3’(HIT-3) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ అడివి శేష్(Adivi Sesh) నటించిన ‘హిట్-2’(HIT-2) కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అయితే శైలేష్ కొలను(Shailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తుండగా.. యూనిమస్ ప్రొడక్షన్స్(Unimus Productions)తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. కాగా దీనికి మిక్కీ మేయర్(Mickey Meyer) సంగీతం అందిస్తున్నారు.
అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం మే1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ ‘హిట్-3’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. Hit-3 లో గెస్ట్ రోల్‌లో ఓ స్టార్ హీరో కనిపించనున్నారట. మరి క్లైమాక్స్ సీన్‌లో కనిపించే ఆ స్టార్ హీరో మరేవరో కాదట మన నందమూరి బాలకృష్ణ.
ఇక అతనితోనే ‘హిట్-4’ ఉండబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ సినిమాలో బాలయ్య ఇన్వాల్వ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవల్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా మరోవైపు ఈ సినిమా క్లైమాక్స్ సీన్‌లో రవితేజ ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అసలు క్లైమాక్స్ సీన్‌లో ఎవరు ఉంటారా అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.