Anand Mahindra: భారత్‌లోకి టెస్లా.. ఆనంద్‌ మహీంద్రా రియాక్షన్ ఇదే!

by D.Reddy |
Anand Mahindra: భారత్‌లోకి టెస్లా.. ఆనంద్‌ మహీంద్రా రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అనేక ఆసక్తికర విషయాలను, ఎన్నో ఇన్స్పిరేషన్ వీడియోలను పంచుకుంటుంటారు. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు (Elon Musk) చెందిన టెస్లా భారత మార్కెట్‌‍లోకి వస్తే ఆ పోటీని ఎలా తట్టుకుంటారని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తర్వాత కూడా తమకు ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. అప్పుడు మార్కెట్‌లోకి వచ్చిన దేశీయ, విదేశీ కంపెనీలైన టాటా, సుజుకీ వంటి ఎన్నో ఇతర కంపెనీలతో పోటీని తట్టుకొని నిలబడ్డామని గుర్తు చేసుకున్నారు. తమ ఉత్తత్పులపై ఉన్న నమ్మకమే దీనికి కారణమని, టెస్లా మార్కెట్‌లోకి వచ్చినా తమ సంస్థ ఇదే విధంగా ముందుకు వెళ్తుందని అన్నారు. దేశ ప్రజలు, వినియోగదారులు ఇస్తున్న ప్రోత్సాహంతో పోటీకి తగ్గట్టు తమను తాము మార్చుకుంటామని తెలిపారు. 2018 సమయంలో ఎలాన్‌ మస్క్‌ సంస్థలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆయనకు మద్దతిస్తూ పెట్టిన పోస్ట్‌ను షేర్‌ చేసి.. అప్పుడెలా ఆయనకు మద్దతు ఇచ్చానో ఇప్పుడు కూడా అలాగే ఉంటానని పేర్కొన్నారు. ఇక, ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story