నా టార్గెట్ 25 మంది అమ్మాయిలు.. మరోసారి తెలుగు హీరోయిన్స్ గురించి నిర్మాత ఆసక్తికర కామెంట్స్ (వీడియో)

by Hamsa |   ( Updated:2025-02-19 09:17:16.0  )
నా టార్గెట్ 25 మంది అమ్మాయిలు.. మరోసారి తెలుగు హీరోయిన్స్ గురించి నిర్మాత ఆసక్తికర కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్(SKN) ‘బేబీ’ సినిమా ద్వారా హిట్ అందుకుని ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. సాయి రాజేష్(Sai Rajesh) తెరకెక్కించిన ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya), ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) నటించారు. అయితే ఈ సినిమా విడుదలూ ఊహించని రెస్పాన్స్‌ను దక్కించుకుంది. దీంతో ఎస్‌కేఎన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి నిత్యం సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇటీవల ‘డ్రాగన్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు అనుభవం అయింది. ఇక నుంచి తెలుగు రాని హీరోయిన్లను తీసుకోవాలని అనుకుంటున్నా అంటూ చేసి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ఇక దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చినప్పటికీ వివాదం సర్దుమనగడం లేదు. ఈక్రమంలో.. తాజాగా, ఎస్‌కేఎన్ ఆసక్తికర వీడియోను షేర్ చేశాడు. ‘‘అందరికీ నమస్కారం నేను ఇటీవల ‘డ్రాగన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సరదాగా తెలుగు అమ్మాయిలతో పని చేయను అన్నట్లు వార్తలు రాశారు. జోక్‌ను ఫన్నీగా తీసుకోండి తప్ప దాన్ని స్టేట్‌మెంట్‌లా తీసుకోకండి. అయితే ఎక్కువగా తెలుగు అమ్మాయిలను పరిచయం చేశాను. రేష్మ, హిమజ, ఇనాయా, వైష్ణవి చైతన్య, ఆనంది(Anandhi), మానస, ప్రియాంక జువాల్కర్(Priyanka Juwalkar), ఐశ్వర్య, ఇషా రెబ్బా వీళ్లందరినీ ఇంట్రడ్యూస్ చేశా. అలాగే నెక్ట్స్ కూడా ఇంకా 8,9 మందిని పరిచయం చేయాలనుకుంటున్నాను. నా టార్గెట్ 25 మందిని తెలుగు ఇండస్ట్రీకి ఇస్తాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

Next Story

Most Viewed