విశేష సేవలు అందించిన వారికి పురస్కారాలు అందించడం అభినందనీయం

by Kalyani |
విశేష సేవలు అందించిన వారికి పురస్కారాలు అందించడం అభినందనీయం
X

దిశ, రవీంద్ర భారతి: పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఉగాది పురస్కారాలు అందించడం అభినందనీయమని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం రవీంద్రభారతిలో కిన్నెర విశ్వా వాసు ఉగాది పురస్కారాలు ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సభ అధ్యక్షులుగా ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, గౌరవ అతిథిగా భోగరాజు మూర్తి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా న్యాయ రంగం జస్టిస్ బి. కృష్ణమోహన్, పోలీస్ రంగంలో ఎంపీ టి. కృష్ణ ప్రసాద్, రక్షణ రంగంలో డా. జి. సతీష్ రెడ్డి, ఇంజనీరింగ్ డా. ఎన్.వీ. రమణారావు, సాహిత్య రంగంలో ఆచార్య నిత్యానందరావు, వైద్య రంగం డా. దశరథ రామిరెడ్డి, నాటక రంగం డా. మీగడ రామలింగ స్వామి, నృత్య రంగం డా. పీ రమాదేవి, సంగీతం పీవి సాయిబాబా, ప్రసార మాధ్యమం డా. ఓలేటి పార్వతీశం, చిత్రలేఖనం డా. కమల ప్రసాదరావు, ఆడిట్ రంగం లోక్నాథ్ లకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉగాది పురస్కారాలను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంస్థకు విశ్రాంత ఐపీఎస్ ప్రభాకర్ రావు అధ్యక్షులుగా ఉండడం సంతోషదాయకమని, సాంస్కృతిక వేడుకలు ఆకట్టుకున్నాయని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ప్రభాకర్ రావు, కార్యదర్శి మద్దాలి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed