- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వన దుర్గమ్మ దర్శనానికి వచ్చి అనంత లోకాలకు..

X
దిశ, పాపన్నపేట: ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఏడుపాయల ఆలయ సమీపంలోని మంజీరా నది రెండో వంతెన వద్ద సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అమీరాబాద్ కు చెందిన సిర్గోయి రాజు(26) ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ జీవిస్తున్నాడు. అమ్మవారి దర్శనం కోసం స్నేహితులతో కలిసి ఏడుపాయల ఆలయానికి సోమవారం వచ్చాడు. స్నానం చేసేందుకు ఆలయ సమీపంలోని రెండో వంతెన వద్ద నీటిలోకి దిగారు. స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. భార్య సురేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Next Story