రష్మికపై ప్రేమను బయటపెట్టి షాకిచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఇదేం ట్విస్ట్ అంటున్న నెటిజన్లు! (పోస్ట్)

by Hamsa |
రష్మికపై ప్రేమను బయటపెట్టి షాకిచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఇదేం ట్విస్ట్ అంటున్న నెటిజన్లు! (పోస్ట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘దొరసాని’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక ఆ తర్వాత తీసిన చిత్రాలన్ని అంతగా హిట్ అందుకోలేకపోయాయి. ఇక 2023లో వచ్చిన ‘బేబీ’ మూవీ హిట్ అందుకోవడంతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. కానీ అప్పటి నుంచి ఏ కొత్త సినిమాను ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఆనంద్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika)పై ఉన్న ప్రేమను బయటపెట్టి అందరినీ షాక్‌కు గురి చేశాడు.

అల్లు అర్జున్(Allu Arjun), రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), విక్కీ కౌశల్(Vicky Kaushal) ముగ్గురు స్టార్స్‌తో మూడు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సాధించిన అందుకున్న హీరోయిన్ రష్మికకు విషెస్ చెప్పాడు. అలాగే వర్క్ పన నీకున్న క్రమశిక్షణ, డెడికేషనే నీకు ఈ విజయాలని తెచ్చిపెట్టాయి అని ఆమె ఫొటోతో పాటు రెడ్ హార్ట్ సింబల్స్‌ను షేర్ చేయడం విశేషం. ఇక అది చూసిన వారంతా ఇదెక్కడి ట్విస్ట్ అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కాగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నిత్యం వీరిద్దరు వెకేషన్స్‌కు కూడా వెళ్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట పెడుతూ సీక్రెట్‌గా రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్నారు.

ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ స్పందించడం లేదు. అయితే రష్మిక మందన్న విజయ్‌తో పాటు అతని ఫ్యామిలీలో ఉన్నవారందరికీ దగ్గరైన సంగతి తెలిసిందే. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి కూడా పోస్టులు పెడుతూ ఉంటుంది. ఇక ఇటీవల నేషనల్ క్రష్ రష్మికకు రౌడీ హీరో తల్లి గులాబీ పువ్వులను కూడా పంపినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటపడంతో మొత్తానికి వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోవడం ఖాయమని అంతా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. ఆనంద్ రష్మికపై ఉన్న ప్రేమను బయటపెట్టడంతో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే అదంతా ఫ్రెండ్‌షిప్ అని అభిమానులు వాదిస్తున్నారు.

Next Story

Most Viewed