- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Pawan Kalyan: పవన్ కళ్యాణా మజాకా.. ఆ ఒక్క సినిమాతో 8 అద్భుత రికార్డులు..!

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇతను తెర మీద కనిపిస్తే చాలు తెగని టికెట్స్ కూడా తెగుతాయి. ఆన్ స్క్రీన్ అయిన సరే , ఆఫ్ స్క్రీన్ అయిన సరే అదే క్రేజ్. మెగా ఫ్యామిలీలో పవర్ స్టార్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం, ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు. పాలిటిక్స్ లో ఎన్నో అవమానాలు పడ్డారు కానీ, ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. ఆయన ఫ్యాన్స్ ముద్దుగా పవన్ స్టార్, జనసేనానిగా పిలుచుకుంటారు. 1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో పవన్ జన్మించారు.
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని చూసి నటన పట్ల ఇష్టాన్ని పెంచుకున్న పవన్.. 1996లో " అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి " ( Akkada Ammayi Ikkada Abbayi ) మూవీతో తెరంగేట్రం చేశారు. తొలిప్రేమ, సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ మూవీస్ పవన్‌కు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి.
" ఖుషి " ( Kushi ) చిత్రంతో రికార్డులు బ్రేక్ చేసిన పవర్ స్టార్ , ఆ తర్వాత వచ్చిన ఐదు సినిమాలు భాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక ఒక్కటైనా హిట్ పడుతుందా అని అనుకున్న టైం లో " జల్సా " (Jalsa ) సినిమా సూపర్ హిట్ అయి కొత్త రికార్డులు సృష్టించాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక యంగ్ కుర్రాడు తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పిన కథ ఇది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతంతో మరింత ఊపునిచ్చింది. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియోట్ చేసింది. అంతేకాదు, జల్సా మూవీ 8 అద్భుత రికార్డులు సాధించి టాలీవుడ్ లో నెంబర్ 1 గా నిలిచింది. అవేంటో ఇక్కడ చూద్దాం..
1. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడం అనేది " జల్సా " మూవీ నుంచే ప్రారంభమైంది.
2. సినిమా రిలీజ్ కు ముందే మూడు పాటలు లీక్ అవ్వడం.. అవి మళ్ళీ బ్లాక్ బాస్టర్ అయ్యాయి. ఈ రికార్డ్ బ్రేక్ చేయడం ఏ హీరో వల్లా కాదు .. ఒక్క పవన్ సినిమా కే సాధ్యం.
3. " జల్సా " మూవీ ఆడియో సీడీల ద్వారానే కోటి రూపాయలు సాధించింది.
4. నైజాంలో రూ. 09.10 కోట్ల షేర్ వసూలు చేసిన మొదటి మూవీగా నిలిచింది.
5. ఈ చిత్రం నుంచే నుంచి ఆడియో ఫంక్షన్ కు పాసులు ఇవ్వడం మొదలైంది.
6. 12 ఏళ్ళ తర్వాత బాలీవుడ్ స్టార్ రాప్ సింగర్ బాబా సెహగల్ ను తెలుగు ఇండస్ట్రీ కి తీసుకు వచ్చిన ఫస్ట్ మూవీ ఇదే.
7. ఈ చిత్రంలోని గాల్లో తేలినట్టుందే అనే పాట కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి సెట్ ఏర్పాటు చేశారు.
8. అలాగే, ఈ మూవీలో స్టార్ హీరో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం గొప్ప విశేషం.