AP Govt.: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల నిర్వహణపై సర్కార్ కీలక ప్రకటన

by Shiva |   ( Updated:2025-01-30 04:11:52.0  )
AP Govt.: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల నిర్వహణపై సర్కార్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షల (Inter First Year Public Examinations)పై కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ విద్య (Intermediate Education)లో ప్రతిపాదిత సంస్కరణలపై మేధావులు, తల్లిదండ్రుల, విద్యార్థల నుంచి వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాది నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యాథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీ సిలబస్ (NCERT Syllabus) అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం వంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్ విద్యా మండలి ప్రకటించింది. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 26న వరకు మేధావులు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి క్షేత్ర స్థాయిలో సలహాలు, సూచనలు స్వీకరించింది.

ఆ సూచనల మేరకు ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యాథతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవేళ పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు చదవుపై ఫోకస్ పెట్టరని, అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతాయని ఇలాంటి సూచనలు వచ్చాయి. ఇంటర్నల్ మార్కుల (Internal Marks) విధానం ప్రతిపాదనలను తీసివేయనున్నారు. ఎన్‌‌సీఈఆర్టీ సిలబస్ (NCERT Syllabus) అమలు చేస్తూ ప్రభుత్వం ఉన్న విధానంలోనే ఇంటర్ ఫస్టియర్ (Inter First Year), సెకండియర్ విద్యార్థులకు (Second Year) పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. మ్యాథ్స్‌లో ఏ, బీ పేపర్స్ ఇక ఉండవు. ఇక నుంచి రెండింటిని కలిపి ఒకే పేపర్‌గా ఇవ్వనున్నారు. బొటనీ (Botany), జువాలజీ (Zoology) సబ్జెక్ట్స్ కలిపి జీవ శాస్త్రంగా ఒకే పేపర్‌ను రూపొందించనున్నారు. లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో (Language Subjects) ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉంటుంది. మరో లాంగ్వేజ్ సబ్జెక్టును విద్యార్థులు తమ ఇష్టాన్ని బట్టి సెలక్ట్ చేసుకోవచ్చు. ఆ అంశాలపై త్వరలోనే ఇంటర్ విద్య మండలి సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

Next Story

Most Viewed