- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
viral video: పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేసిన గుర్రం.. ఇంతలో షాకింగ్ ఘటన

దిశ, వెబ్ డెస్క్: అంతా సంతోషంగా పెళ్లి తంతు ముగించుకుని, ఘనంగా బరాత్ నిర్వహించారు. ఈ వేడకలో డీజే మ్యూజిక్‌కు గుర్రం సైతం డ్యాన్స్ వేసింది. ఇంతలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. గుర్రం వెనుక ఆడుకుంటున్న చిన్నారిని అది కాళ్లతో తన్నింది. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటనతో అక్కడంతా ఒక్కసారిగా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. యూపీలోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..
ఉత్తరప్రదేశ్ (UP) కాన్పూర్‌లోని హనుమంత్ విహార్ పోలీసు స్టేషన్ ప్రాంతంలోని ఠాకూర్ చౌక్‌లో జనవరి 27న రాత్రి వేళ ఒక వివాహం జరిగింది. బ్యాండ్ మేళం మ్యూజిక్‌కు అనుగుణంగా ఒక గుర్రం డ్యాన్స్ చేసింది. ఆ సమయంలో అక్కడే ఆడుకుంటున్న ఓ బాలుడు డ్యాన్స్ చేస్తున్న గుర్రం వెనుకకు వచ్చాడు. ఇంతలో ఆ గుర్రం వెనుక కాళ్లతో ఆ బాలుడిని తన్నింది (Dancing Horse Kicks Child). దీంతో అక్కడున్న గట్టుకు ఆ బాలుడి తల బలంగా తగిలి, తీవ్ర రక్తస్త్రావమై అక్కడికక్కడే మరణించాడు. ఇది చూసి బాలుడి కుటుంబంతో పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటనతో ఆ పెళ్లి వేడుకలో సంతోషం కాస్తా విషాదంగా మారిపోయింది. మరోవైపు బాలుడి తల్లిదండ్రులు సోకసంద్రంలో మునిగిపోయారు. ఎంతో ఉత్సాహంగా కనిపించిన తమ కూమారుడు ఇక లేడని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ బాలుడిని గుర్రం రూపంలో మృత్యువు వెంటాండింది.
ఆ ప్రాంతంలో సీసీటీవీల్లో (CCTV Records) రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral in Social media) మారటంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటి వేడుకల్లో పిల్లల పట్ల జాగ్రత్త ఉండాలని, వారిని పర్యవేక్షించాలని లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశముంటుందని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.