- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Mahakumbh Mela : మహాకుంభమేళాలో ఐదు కీలక మార్పులు

దిశ, వెబ్ డెస్క్ : మహా కుంభమేళా(Mahakumbh Mela)పై యూపీ సర్కార్(UP Government) కీలక నిర్ణయాలు తీసుకుంది. మౌని అమావాస్య అమృత స్నానాల సందర్భంగా ప్రయాగ రాజ్ మహాకుంభ మేళాలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కుంభమేళా నిర్వాహణలో ఐదు మార్పులు(Five Key Changes) చేసింది. ముఖ్యమైన ఘాట్ వద్ధ భక్తుల రద్దీ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 4 వరకు నో వెహికల్ జోన్ అమలు చేయాలని ఆదేశించింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు అనుమతి నిరాకరిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. వన్ వే రూట్ అమలు చేయాలని నిర్ణయించింది. వీవీఐపీ పాసులు రద్దు చేయాలని మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మహాకుంభమేళాలో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనలో 30మంది మృతి చెందడం..మరో 60మందికి పైగా గాయాలకు గురవ్వడంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ సర్కార్ దిద్ధుబాటు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించిన యోగి సర్కార్ తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. జస్టిస్ కృష్ణ కుమార్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 15 రోజుల్లో రిపోర్టు సమర్పించాలని కమిటీని ఆదేశించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్పష్టం చేశారు.
అలాగే.. తొక్కి సలాటలో మృతి చెందిన కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించింది. గాయపడిన వారి వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొంది. మౌని అమావాస్య సందర్భంగా బ్రహ్మ ముహూర్తానికి ముందు బుధవారం తెల్లవారుజామున 1 నుండి 2 గంటల మధ్య అఖారా మార్గ్‌లో పెద్ద సంఖ్యలో ఘాట్ లకు చేరుకున్న భక్తులు త్రివేణి సంగంలో ఒక్కసారిగా స్నానాలు చేసేందుకు ఎగబడటంతో బారికేడ్లు విరిగిపోయి తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటన నేపథ్యంలో ఆఖాడా పరిషత్ తమ అమృత స్నానాలను వాయిదా వేసుకుంది. వసంత పంచమి రోజు స్నానానికి రావాలని పరిషత్ భక్తులకు సూచించింది. మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాలో రెండో శాహీ స్నానం నిర్వహిస్తారు. తొక్కిసలాట కారణంగా అది రద్దయింది. ఇక, ఇతర ముఖ్యమైన స్నాన తేదీలు ఫిబ్రవరి 3 (వసంత పంచమి- మూడో శాహీ స్నానం), ఫిబ్రవరి 12 (మాఘీ పూర్ణిమ), ఫిబ్రవరి 26 (మహా శివరాత్రి) మిగిలి ఉన్నాయి. దీంతో భక్తుల రద్ధీ కొనసాగనున్న నేపథ్యంలో మరోసారి తొక్కిసలాట సహా ఇతర ప్రమాదాలు వాటిల్లకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.