- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
AP Govt.: అలాంటి ఇళ్ల క్రమద్దీకరణకు లైన్ క్లియర్.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు

దిశ, వెబ్‌డెస్క్: కూటమి సర్కార్ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ (Regularization of Government Lands)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ రెగ్యులరైజేషన్ (Land Regularization)కు సంబంధించి విధివిధానాలు కూడా ఖరారు అయ్యాయి. ఈ మేరకు భూముల క్రమద్దీకరణ పథకం-2025 పేరుతో సీఎస్ విజయానంద్ (CS Vijayanand) ఉత్తర్వులు జారీ చేశారు. అర్బన్ (Urban), రూరల్ (Rural) ఏరియా క్రమబద్దీకరణకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యూలషన్స్ (Rules and Regulations)ను పక్కాగా అమలు చేయనున్నారు.
కాగా, అభ్యతరం లేని సర్కార్ భూముల ఆక్రమణల రెగ్యులరైజేషన్ పట్టాలను మహిళల పేరు మీదే జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2019 అక్టోబర్ 15 కంటే ముందు ఆక్రమించిన వారికి 150 గజాల వరకు మాత్రమే నిబంధనలను అనుసరించి క్రమబద్దీకరణ నిర్ణయాన్ని వర్తింపజేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఆదాయ పన్ను చెల్లింపుదారు అయి ఉండకూదని కండీషన్ పెట్టింది. అదేవిధంగా లబ్ధిదారులకు కారు ఉండకూడదని తెలిపింది. కానీ, వ్యవసాయ అవసరాలకు వినయోగిస్తున్న టాక్సీ, ఆటో, ట్రాక్టర్లు ఉన్న వారికి మాత్రం మినహాయింపు ఇచ్చింది.
గత కేబినెట్ భేటీలో ఆమోదించిన మేరకు రెవెన్యూ శాఖ క్రమబద్దీకరణపై బుధవారం రాత్రి జీవో నెం.30 (GO No.30)ని విడుదల చేసింది. అదేవిధంగా లబ్ధిదారులు 150 గజాల నిర్మాణానికి జరిగే రిజిస్ట్రేషన్ ఫీజును కూడా చెల్లించాల్సి అక్కర్లేదని జీవో పేర్కొన్నారు.151 నుంచి 300, 300 నుంచి 450 గజాలు ఆ పైన ఇంటి నిర్మాణాలను అనుసరించి వారి ఆర్థిక స్థోమతను అనుసరించి రిజిస్ట్రేషన్ బేసిక్ వాల్యూతో చెల్లించాల్సిన ఫీజులను జీవో వెల్లడించారు. అదేవిధంగా మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్‌లో నిర్దేశిత స్థలాలు, లే అవుట్ స్థలాలు, కాలువలు, నదీ ప్రవాహ గట్లు, ఇతర జల వనరులకు సంబంధించిన స్థలాల్లో క్రమబద్ధీకరణ సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.