- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
మరో కల సాకారానికి తొలి అడుగు.. కేంద్రానికి ఏపీ కీలక లేఖ

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో మరో కల సాకారానికి తొలి అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రంలో మెట్రో రైళ్ల(Metro Rails)ను ఏర్పాటు చేయాలనే హామీ ఉంది. ఈ హామీ నెరవేర్చేదెప్పుడు అని పది ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ఐదేళ్లలో ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మెట్రో రైలు ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా మెట్రో రైల్ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉందనే సంకేతాలిచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం(Central Government) కూడా ముందుకు వచ్చింది. ఈ మేరకు తాజాగా రాష్ట్రంలో రెండు మెట్రో రైలు ప్రాజెక్టులకు కీలక అడుగులు పడుతున్నాయి.
2014లో ఏపీ పునర్ వ్యవస్థీకరణ(AP Reorganization) జరిగిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రెండు రాష్ట్రాలు ఏర్పాటు జరిగాయి. విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు అప్పటి ప్రభుత్వం సహకారం అందించింది. రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా విజయవాడ(Vijayawada), విశాఖ(Visakha)లో మెట్రో రైలు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అప్పట్లో కొంత అడుగులు పడ్డాయి. మెట్రో నిర్మించడానికి 2014లో ఏర్పడిన చంద్రబాబు కసరత్తులు చేశారు. భూసేకరణకు ప్రయత్నం చేశారు. కానీ 2019లో ప్రభుత్వం మారింది. దీంతో ప్రాజెక్టు అంశం అక్కడే ఆగిపోయింది.
అయితే మళ్లీ పురుడు పోసుకుంది. మెట్రో రైలు ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విజయవాడ, విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. భూసేకరణకు సిద్ధమైంది. మొత్తం 199 ఎకరాల భూ సేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీంతో విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాల భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. తొలిదశ పనులకు రూ.11,009 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు డీపీఆర్‌లను తయారు చేసిన కేంద్రానికి పంపారు. వందశాతం నిధులు కోరుతూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మరి కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.