అధికారులు ఆ పది రోజులు తమ వ్యక్తిగత జీవితాన్ని వదిలేశారు.. తహశీల్దార్

by Sumithra |
అధికారులు ఆ పది రోజులు తమ వ్యక్తిగత జీవితాన్ని వదిలేశారు.. తహశీల్దార్
X

దిశ, గీసుగొండ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమాన్ని అయినా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని తహశీల్దార్ ఎండీ రియాజుద్దీన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ పథకాల అమలుకు మండలంలోని పంచాయతీ రాజ్, రెవెన్యూ, వ్యవసాయ, ఉపాధి హామీ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి సర్వేను విజయవంతం చేసినందుకు ఎంపీడిఓ వి.కృష్ణవేణి, తహశీల్దార్ ఎండి రియాజుద్దీన్ వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ఎండీ రియాజుద్దీన్ మాట్లాడుతూ అన్ని శాఖల ఉన్నత, కింది స్థాయి అధికారుల సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు పథకాల సర్వేను రేయిపగలు కష్టపడి పూర్తి చేసి, గ్రామ సభలను విజయవంతం చేశారని అన్నారు. ఈ పథకాల సర్వే కోసం అధికారులు తమ వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి.. పది రోజులు కష్టపడి పని చేయడం వల్లనే ఈ పథకాల సర్వే నిర్ణీత గడువులోపు పూర్తి చేశామని, అధికారుల కింది స్థాయి ఉద్యోగుల సేవలను కొనియాడారు.

ఇదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చిన ఇదే విధంగా కష్టపడి పనిచేసి మండలాన్ని జిల్లా రాష్ట్రస్థాయిలో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని కోరారు. ఎంపీడీఓ కృష్ణవేణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలు విజయవంతం కావడంలో గ్రామస్థాయి మల్టీపర్పస్ వర్కర్ల, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది, ఆపరేటర్ల సహకారం ప్రశంసనీయం అన్నారు. సంక్షేమ పథకాల సర్వే ప్రక్రియలో గ్రామసభ నిర్వహణలో అధికారులకు ఏమైనా సమస్యలు ఎదురైతే తహశీల్దార్ ఎండి రియాజుద్దీన్ సమన్వయంతో సమస్యలను పరిష్కరించారని, వారి సహకారంతోనే ఈ కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. తదనంతరం ఉత్తమ అధికారులుగా ఎంపికైన గిరిధవార్ పి.సాంబయ్య, కొమ్మాల కార్యదర్శి శంకర్ రావు, కొనాయిమాకుల కార్యదర్శి హేమలతను ఎంపీడీఓ, తహశీల్దార్ శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గీసుగొండ సీఐ ఎ.మహేందర్, ఎంపీఓ ఆడేపు ప్రభాకర్, సూపర్డెంట్ కమలాకర్, ఏపీఓ చంద్రకాంత్, ఎంఓపీఆర్డీ అధికారి శేఖర్, ఎఈఓలు రజిని, కావ్య, ఎఎస్ఓ ఉదయశ్రీ, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ, ఉపాధి హామీ సిబ్బంది, ఈ ఆపరేటర్లు మల్టీపర్పస్ వర్కర్లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed