ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మహర్ధశ

by M.Rajitha |
ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మహర్ధశ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే స్పెషాలిటీ సేవలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోన్నది. గ్రామ స్థాయిలోనే మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తుంది. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనూ పీడియాట్రిక్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆప్తల్మాలజీ, డెంటల్, ఆర్థోపెడిక్స్‌, పల్మనరీ మెడిసిన్, ఈఎన్‌టీ వైద్య సేవలు అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. రొటేషన్ విధానంలో ఈ ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా స్పెషాలిటీ డాక్టర్ల వివరాలను ఆయా విభాగాల హెచ్వోడీలు సేకరిస్తున్నారు. టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా, ఏరియా, కమ్యూనిటీ సెంటర్లలో పనిచేస్తున్న డాక్టర్లను ఈ సేవల్లో భాగస్వామ్యం చేయనున్నారు. పీహెచ్సీకి వచ్చిన పేషెంట్ కు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, ఉన్నత వైద్యంకు అవసరమైన సర్కారీ దవాఖానకు రిఫర్ చేయనున్నారు. దీని వలన పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుందనేది ప్రభుత్వ భావిస్తోంది.

Next Story

Most Viewed