- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నలుగురు ఎమ్మెల్యేలను లాక్కోవడం మూలంగా బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చగలం అనుకుంటే పొరపాటు: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలో రాగానే రేవంత్ డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక ఆగస్టు 15న చేస్తామన్నారని నిరంజన్ రెడ్డి విరుచుకుపడ్డారు.
నాడు కారుకూతలు నేడు పథకాల్లో కోతలు అంటూ సెటైర్లు వేశారు. లోక్ సభ ఎన్నికలు నా పాలనకు రెఫరెండం అన్న రేవంత్ మాటకు దిక్కు లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యంపై కాంగ్రెస్ అధిష్టానమే కమిటీ వేసిందని పేర్కొన్నారు. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా తప్పును సరిదిద్దు కోలేవని మండిపడ్డారు. ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలనివ్వను అన్న రేవంత్.. ఇంటింటికి తిరిగి కండువాలు కప్పుతున్నాడని ఎద్దేవా చేశారు.
వైఎస్ హయాంలో ఎంతో మంది ఎమ్మెల్యేలను లాక్కున్నాడు.. కానీ తెలంగాణను ఆపలేక పోయాడని అన్నారు. తెలంగాణ అనేది నిరంతర జ్వాల.. దానిని నిరంతరం కాపాడుకుంటామని, తెలంగాణ తెచ్చిన పార్టీగా, పదేళ్లు గొప్పగా పాలించిన పార్టీగా నిరంతరం పోరాడతామని ధీమా వ్యక్తం చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను లాక్కోవడం మూలంగా బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చగలం అనుకుంటే పొరపాటు అని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుతోనే సాధ్యం.. అవి సాధ్యంకాని హామీలు కాబట్టి మీరు విజయవంతం కాలేరన్నారు. రాష్ట్రంలో రెండు నెలలుగా ఫించన్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
రైతుబంధు ఎప్పుడిస్తారని రైతులు అడుగుతున్నారు.. రైతుబంధు ఎక్కడని ప్రశ్నించారు. కోరి తెచ్చుకున్న మొగడు కొట్టినా పడాలి, తిట్టినా పడాలి అన్నట్లు పరిస్థితి ఉందని కామెంట్లు చేశారు. రైతుభరోసా సంగతి దేవుడెరుగు.. రైతుబంధుకే దిక్కు లేదని తెలిపారు. మొదట రుణమాఫీకి 40 వేల కోట్లు కావాలన్నాడు.. క్యాబినెట్ మీటింగ్ అనంతరం రుణమాఫీకి 30 వేల కోట్లే అని అంటున్నాడని, రుణమాఫిపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతుందని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుణమాఫీకి సంబంధించి రూ.19 వేల కోట్లకు రూ.14 వేల కోట్లు ఇచ్చామన్నారు. ఎన్నికల నాటికి మిగిలిపోయిన రైతాంగానికి రుణమాఫీ చేస్తారా ? చేయరా? ప్రకటించండంటూ గొంతెత్తి ప్రశ్నించారు. గ్రామాలు, మండలాల వారీగా రైతులు తీసుకున్న రుణాల వివరాలు ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో 5 ఎకరాల లోపు రైతులు ఎవరికీ రూ.2 లక్షల రుణాలు లేవు. ఈ విషయం బ్యాంకు అధికారులే చెబుతున్నారన్నారు. రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తారా? కౌలు రైతులు ఎంత మంది ఉన్నారు ? వారికి రూ.15 వేలు ఇస్తారా? వడ్లకు రూ.500 బోనస్ ఇస్తారా? ఇప్పటికే రెండు పంటలు పోయాయి? అని ప్రశ్నించారు.
వడ్లకు బోనస్ నమ్మలేదు కానీ రైతుభరోసా ఇస్తారని నమ్మి మోసపోయాం అని రైతులు చెబుతున్నారన్నారు. మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఏమయ్యాయి అని అడిగారు. ఎన్నికల్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తాం అని చెప్పారు.. ఇప్పుడు రేషన్ కార్డులన్ని రద్దు చేసి పథకాలను కుదించే ప్రయత్నాల్లో ఉన్నారని పేర్కొన్నారు. దేశ జనాభా రెండుగా చీలిన కూలక సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యం వహించిందని వెల్లడించారు. రుణమాఫీ వ్యవహారం సినిమా లెక్క ఉంది.. ఆడియో రిలీజ్, ఫస్ట్ పిక్, ప్రీమియర్ షో, రిలీజ్ షో లెక్క ఉందంటూ సెటైర్ వేశారు. మేం నోరు కట్టుకుంటే రుణమాఫీ ఒక లెక్కనా అని అపహాస్యం చేశారని తెలిపారు. రుణమాఫీ చేయకుండానే సంబరాలు చేయడం దారుణమన్నారు.