- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS: ముగిసిన SI ఫైనల్ రాత పరీక్షలు.. మొత్తం ఎంతమంది రాశారంటే?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన తుదిరాత పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. ఈ పరీక్షలకు సుమారు 96 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో 81 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయన్నారు. శనివారం రెండు పేపర్లు, ఆదివారం రెండు పేపర్ల చొప్పున పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొ్నారు. శనివారం జరిగిన ఎగ్జామ్‌కు 62,342 మంది అభ్యర్థులకు గాను 59,534 మంది అభ్యర్థులు హాజరయ్యారని, 95.50 హాజరు శాతం నమోదైందని పేర్కొన్నారు.
ఆదివారం జరిగిన పరీక్షకు 79 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 60,772 మంది అభ్యర్థులకు గాను 58,019 మంది పరీక్ష రాయగా.. 95.47శాతం హాజరు నమోదైందని వెల్లడించారు. పరీక్ష సమయంలో అభ్యర్థుల బయోమెట్రిక్ వెరిఫికేసన్ పూర్తి చేశామని, ప్రిలిమినరీ రాత పరీక్ష సమయంలో తీసుకున్న ఫింగర్ ప్రింట్స్, ఫొటోగ్రాఫ్‌లతో గుర్తింపును నిర్ధారించినట్లు తెలిపిందన్నారు. పేపర్లకు సంబంధించిన ప్రిలిమినరీ కీ ని త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.