GST రీఫండ్ కుంభకోణంలో వెలుగులోకి షాకింగ్ నిజాలు

by Rajesh |
GST రీఫండ్ కుంభకోణంలో వెలుగులోకి షాకింగ్ నిజాలు
X

దిశ, వెబ్‌డెస్క్: జీఎస్టీ రీఫండ్ కుంభకోణంలో తవ్వేకొద్ది షాకింగ్ నిజాలు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ సొమ్ముకు కన్నం వేసిన వారి భరతం పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.బోగస్ ఇన్ వాయిస్‌లు సృష్టించి జీఎస్టీ వెబ్ పోర్టల్‌లో అప్ లోడ్ చేసినట్లు తేలింది. 2022 జులై నుంచి 2023 నవంబరు వరకు రీఫండ్‌ల కుంభకోణం జరిగింది. జీఎస్టీ చట్టంలోని వెసులుబాటను ఆసరా చేసుకుని అవినీతికి బీజం పడినట్లు గుర్తించారు. మేరట్ లోని డీజీజీఐ అప్రమత్తతతో బాగోతం వెలుగులోకి వచ్చింది. డిప్యూటీ కమిషనర్ నుంచి కిందిస్థాయి వరకు పంపకాలు జరిగినట్లు తెలిసింది.

అధికారుల సహకారంతో వ్యాపారం చేయకుండానే రీఫండ్‌లు పొందినట్లు గుర్తించారు. ఎలక్ట్రిక్ వాహనాల విలువపై కేవలం 5 శాతం మాత్రమే జీఎస్టీ వేసినట్లు తేలింది. ద్విచక్ర వాహనాల విడిభాగాల కొనుగోలుపై 18 శాతం వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. రీఫండ్ దరఖాస్తులను పరిశీలన చేయకుండానే మంజూరు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. బోగస్ ఇన్ వాయిస్ లని తెలిసీ రీఫండ్‌లు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ ఇచ్చిన ఫిర్యాదుపై పలువురిని అరెస్ట్ చేశారు. ఆ శాఖకు చెందిన ఐదుగురిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ.40 కోట్ల రీఫండ్ లకు సంబంధించి అరెస్ట్‌లు చేపట్టారు. వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ఒక ఉప కమిషనర్, ఇద్దరు సహాయ కమిషనర్లు, డీసీటీవో, సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్ అయ్యారు.

Advertisement

Next Story