Shilpa Reddy: బడ్జెట్‌లో మహిళలపై చిన్నచూపు

by Gantepaka Srikanth |
Shilpa Reddy: బడ్జెట్‌లో మహిళలపై చిన్నచూపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బడ్జెట్‌లో మహిళలకు ఇస్తామన్న హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూసిందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి విమర్శలు చేవారు. మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా మహాలక్ష్మి స్కీమ్స్ అన్నింటినీ అమలు చేయాలని, వాటికి బడ్జెట్ కేటాయించాలనే డిమాండ్‌తో మహిళా మోర్చా ఆధ్వర్యంలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం ధర్నాకు దిగారు. మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన గ్యారంటీలు గాలికి వదిలి మహిళలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు.

మహిళలకు రూ.4 వేల పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పలేదని ఫైరయ్యారు. మహాలక్ష్మి పథకం కింద రూ.2500 అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. విద్యార్థినులకు ఇస్తానన్న స్కూటీల ఊసే లేదని ఫైరయ్యారు. విద్యార్థినులకు రూ.5 లక్షల భరోసా కార్డు అడ్రస్సే లేదన్నారు. ఎన్నికల ముందు 6 గ్యారంటీల పేరుతో మహిళలకు హామీ ఇచ్చిన సోనియా, ప్రియాంక గాంధీ వారికి సమాధానం చెబుతారా లేక మహిళా మంత్రులు సమాధానం చెబుతారా? అని శిల్పా రెడ్డి ప్రశ్నించారు. మహిళలకు ఇస్తామన్న హామీలన్నీ నెవరేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

Next Story