ఓల్డ్ బోయినపల్లిలో యువతి అదృశ్యం..

by Sumithra |
ఓల్డ్ బోయినపల్లిలో యువతి అదృశ్యం..
X

దిశ, తిరుమలగిరి : బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ బోయినపల్లి సీతారాంపురం బస్తీకి చెందిన ఓ యువతి అదృశ్యమైనట్లు బోయినపల్లి ఎస్ఐ శివశంకర్ సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కరిష్మా కుమారి అనే యువతి ఈ నెల 22న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇంట్లో నుండి వెళ్లిపోయినట్లు తల్లి చోటి రూబీదేవి సోమవారం ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గత 5 రోజుల నుండి ఆమె సెల్ ఫోన్ లో నిరంతరం ఓ వ్యక్తితో మాట్లాడుతుందని, ఈ విషయమై యువతి తల్లి గుర్తించి ఆమె తన కూతురిని అదేవిధంగా ఫోన్లో మాట్లాడే వ్యక్తిని హెచ్చరించినట్లు తెలిపారు.

కాగా 22న బయటకు వెళ్లిన తమ కూతురు తిరిగి రాలేదని, దీంతో అన్ని చోట్లా వెతికి స్నేహితులు, బంధువులను విచారించినా ఫలితం లేకుండా పోయిందని తల్లి తెలిపినట్లు ఎస్సై పేర్కొన్నారు. తమ కూతురు ఛోటూ అనే అబ్బాయితో సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నట్లు తమకు సమాచారం వచ్చిందని, బహుశా తమ కూతురు అతనితో కలిసి వెళ్లి ఉండవచ్చని అనుమానంగా ఉందని యువతి తల్లి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed