- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు షూ గిఫ్ట్ ఇచ్చిన షర్మిల(వీడియో)
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ కోసం షూస్ తీసుకున్నానని, ఆయనకు దమ్ముంటే తనతో కలిసి ఒక్కరోజు పాదయాత్రకు రావాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోటస్ పాండ్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్‌కు షూ సైజ్ సరిపోకుంటే చెప్పాలని, రిటర్న్ ఆప్షన్ కూడా ఉన్నట్లుగా ఆమె కామెంట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు తను ఇవ్వాలనుకున్న షూ ని షర్మిల మీడియా ముందు ప్రదర్శించారు. తన పాలనపై తనకు నమ్మకం ఉంటే తనతో ఒక్కరోజు పాదయాత్రకు రావాలని ఆమె సవాల్ విసిరారు. సమస్యలు లేవని రుజువైతే తాను ముక్కు నేలకు రాస్తానని షర్మిల వ్యాఖ్యనించారు.
సమస్యలుంటే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సవాల్‌కు కేసిఆర్ సిద్ధమేనా అని షర్మిల ప్రశ్నించారు. దమ్ముంటే కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో పబ్లిక్ ఫోరం నిర్వహించాలని సూచించారు. గవర్నర్ బిజీ షెడ్యూల్ వల్ల కలవలేకపోయారని ఆమె పేర్కొన్నారు. పాదయాత్ర చేస్తున్న తమపై అకారణంగా గతంలో దాడి చేశారని, ఆగిన చోట నుంచే పాదయాత్ర పున:ప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ అనేక వాగ్ధానాలు ఇచ్చి సీఎం అయ్యారని, ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని మండిపడ్డారు. నెరవేర్చని వాగ్ధానాలు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని ఆమె ప్రశ్నించారు. రైతు డిఫాల్టర్ కాదని, రుణమాఫీ చేయని డిఫాల్టర్ సీఎం కేసీఆర్ అని ఆమె ధ్వజమెత్తారు.
రైతులకు రూ.5 వేలు ఇచ్చి రూ.30 వేల సబ్సిడీ ఆపేశారని ఫైరయ్యారు. ఉద్యమ సమయంలో గ్రూప్1 పరీక్ష రాయకుండా అభ్యర్థులను కేసిఆర్ రెచ్చగొట్టారని, ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్కరికైనా గ్రూప్ ఉద్యోగం వచ్చిందా సమాధానం చెప్పాలని షర్మిల ప్రశ్నించారు. ఈ ఏడాది ఏ స్కీమ్ పెట్టినా అది ఎన్నికల కోసమేననే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు. ఈ ఎనిమిదేండ్లలో కనీసం 25 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కూడా కట్టలేదన్నారు. కేసిఆర్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలో చేరుతానని తనకు మాటిచ్చాడని షర్మిల సంచలన కామెంట్స్ చేశారు.