Shankarpally: మామూళ్ల పేరుతో రిపోర్టర్ల బెదిరింపులు.. కేసు నమోదు

by Rani Yarlagadda |   ( Updated:2024-10-09 13:57:18.0  )
Shankarpally: మామూళ్ల పేరుతో రిపోర్టర్ల బెదిరింపులు.. కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: దసరా పండుగకు మామూళ్ల పేరుతో బెదిరింపులకు పాల్పడిన ఐదు మీడియా సంస్థలకు చెందిన రిపోర్టర్లపై శంకర్ పల్లి పోలీస్ స్టేషన్లో (Shankarpally Police Station) కేసు నమోదైంది. శంకర్ పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల మేరకు.. శంకర్ పల్లిలో ఉన్న ఓ ఆస్పత్రి యాజమాన్యాన్ని ఐదుగురు రిపోర్టర్లు బెదిరించారు. దసరా పండుగకు రూ.10 వేలు మామూలు ఇవ్వాలని అడగ్గా.. యాజమాన్యం తాము ఇవ్వలేమని చెప్పింది. తాము అడిగినంత మామూళ్లు ఇవ్వకపోతే ఆస్పత్రికి సంబంధించిన లొసుగులన్నింటినీ తీసి బయటపెడుతామని, పర్మిషన్ రద్దు చేయిస్తామని బెదిరించారు.

రిపోర్టర్లు బెదిరించడంతో.. సదరు ఆస్పత్రి యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. శంకర్ పల్లి పీఎస్ లో ఫిర్యాదు చేయగా.. ఐదుగురు రిపోర్టర్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇకపై ఎవరైనా మీడియా పేరు చెప్పి ఇలా అక్రమ వసూళ్లకు పాల్పడితే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొన్నవారెవరైనా సరే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కంప్లైంట్ చేసినవారి పేర్లు వెల్లడించకుండా బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Next Story