- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేనేం తప్పు చేశా.. నన్నేందుకు బలి చేశారు: ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సంచలన వ్యాఖ్యలు
దిశ, నాచారం: ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హబ్సిగూడలో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2001 బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి తాను పార్టీలోనే ఉన్నానని.. ఎన్నో ఇబ్బందులు, తిప్పలు పడి ఉప్పల్‌లో పార్టీని కాపాడానని అన్నారు. తనను కాదని ఉప్పల్ టికెట్ ప్రకటించిన బండారు లక్ష్మారెడ్డి పార్టీ కోసం ఏం చేశాడని.. ఏనాడైనా జెండా మోసిండా అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి టికెట్ ఎలా కేటాయిస్తారని అధిష్టానాన్ని నిలదీశారు.
ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నేతల ఫొటోలు పెట్టుకుని తిరుగుతున్నాడని అన్నారు. గ్రేటర్‌లో నేను ఒక్కడిని ఉద్యమకారుడినని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప్పల్ టికెట్ వేరే వ్యక్తికి ఇచ్చే ముందు కనీసం తనతో చర్చించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఏం తప్పు చేశానని.. తనను ఎందుకు బలి చేశారని ఎమోషనల్ అయ్యారు. తనకు టికెట్ కేటాయించపోవడంతో తన కేడర్ ఆందోళన చేస్తామంటే తానే వద్దన్నానని చెప్పారు.
10 రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని భేతి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ ఇటీవల 115 మందితో కూడిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ జాబితాలో ఉప్పల్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన భేతి దక్కలేదు. ఉప్పల్ టికెట్‌ను సీఎం కేసీఆర్ బండారు లక్ష్మారెడ్డికి కేటాయించారు. దీంతో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.