Bhatti Vikramarka: ఉద్యోగుల పిల్లల కోసం ఓ పథకం.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన

by Prasad Jukanti |   ( Updated:2024-10-08 10:43:00.0  )
Bhatti Vikramarka: ఉద్యోగుల పిల్లల కోసం ఓ పథకం.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత పదేళ్లుగా విద్యుత్ శాఖలో ప్రమోషన్లు లేక అధికారులు ఇబ్బందులు పడ్డారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెడింగ్ లో ఉన్న ప్రమోషన్లు ఇచ్చామని చెప్పారు. ఈ శాఖలోని ఉద్యోగులపై భారం లేకుండా ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు ఇచ్చి సిబ్బందిని రిక్రూట్ చేయబోతున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన భట్టి విక్రమార్క ఈ పరిసర ప్రాంతంలో అవసరం అయినన్ని సబ్ స్టేషన్లు నిర్మిద్దామన్నారు. ఎక్కడ కూడా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లు వేలాడి ఉండకూదన్నారు. అధికారులు సీరియస్ గా తీసుకుని మరమ్మతులు చేపట్టాలి. ప్రభుత్వం ఎంత చర్యలు తీసుకున్న క్షేత్రస్థాయిలో లైన్ మెన్ల ప్రవర్తన సరిగా లేకపోతే చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల వారి వైఖరి పట్ల ఉన్నతాధికారులు పర్యవేక్షణ ఉండాలి. ఇంధన శాఖలో పనిచేసే ఉద్యోగుల పిల్లల చదువుల విషయంలో కొత్త స్కీమ్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు. విద్యుత్ సంబంధిత సమాచారం, ఫిర్యాదుల కోసం1912 హెల్ప్ లైన్ నంబర్ ను అధికారులు ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

పునరుత్ఫాదక ఇందన ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. ఇందుకో అవసరమైన బడ్జెట్ ను సిద్ధం చేసుకుంటోందన్నారు. కరెంట్ ట్రిప్ కాకుండా అవసరం మేరకు ట్రాన్స్ ఫార్మర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులకు పంటతో పాటు పవర్ తో ఆదాయం వచ్చేలా వ్యవసాయ మోటార్లకు సోలార్ పంపు సెట్లు ఇవ్వబోతున్నామన్నారు. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ స్కీమ్ ను అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కరెంట్ ను కొనుగోలు చేయబోతున్నదన్నారు. అలాగే గ్రామాల్లో ప్రజల ఇండ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ శాఖలోని ఉద్యోగాలు అత్యంత ముఖ్యమైనవారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed