మహిళలకు భారీ షాకివ్వనున్న ఆర్టీసీ.. ఇకపై వారంతా టికెట్ తీసుకోవాల్సిందే? కానీ కాస్ట్లీ గిఫ్ట్స్

by Anjali |   ( Updated:2024-06-25 08:07:37.0  )
మహిళలకు భారీ షాకివ్వనున్న ఆర్టీసీ.. ఇకపై వారంతా టికెట్ తీసుకోవాల్సిందే? కానీ కాస్ట్లీ గిఫ్ట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో విపరీతంగా రద్దీ నెలకొంది. ఈ క్రమంలో బస్సులో ప్రయాణించే మహిళలు కొట్లాటలకు దిగుతున్నారు. కొన్నిసార్లు ఈ గొడవలు పోలీసు స్టేషన్ వరకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఫ్రీ పథకం వల్ల ఆదాయం పెరిగినప్పటికీ మగవారు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సు నిండా మహిళలే ఎక్కడంతో సీట్లు లేక మగవారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం కూడా బస్సుల సంఖ్య పెంచాలని భావిస్తోంది.

ఫ్రీ కావడంతో ఎక్స్‌ప్రెస్, ఆర్డీనరి బస్సుల్లో ఎక్కువగా ప్రయాణించడం.. డీలక్స్ బస్సుల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది. కాగా ఈ క్రమంలో ఆర్టీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రయాణికులను డీలక్స్ బస్సుల వైపు మళ్లించేందుకు ఆర్టీసీ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే డీలక్స్ బస్సుల్లో మహిళలు ప్రయాణించినట్లైతే మహిళలకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తామంటూ ఆర్టీసీ మరో స్కీం స్టార్ట్ చేసింది. ముందుగా హనుమకొండ-హైదరాబాదు మార్గంలో జనగామ డిపో 3 బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సుల్లో ప్రయాణిస్తే ప్రతి 15 రోజులకు ముగ్గురు మహిళలకు బస్సు అందజేస్తామని ఆర్టీసీ అనౌన్స్ చేసింది. ముందు ముందు ఈ ఫ్రీ బస్సు పథకాన్ని కూడా తొలగించే అవకాశాలున్నాయంటూ జనాలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed