హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఛాన్సే లేదు: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఛాన్సే లేదు: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జూన్ 2 వరకే హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుందని.. ఆ తర్వాత హైదరాబాద్‌ను బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతం చేస్తుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మంగళవారం మీడియాతో ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేసినా రాష్ట్ర ఆదాయం ఏం తగ్గదని అన్నారు. ఇక, రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ముగియడంతో రాజకీయ కార్యకాలాపాలు ముగిశాయని, రేపటి నుండి పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెడతామని తెలిపారు. కాగా, కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ కిషన్ రెడ్డి సైతం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ఉద్దేశం బీజేపీకి లేదని క్లారిటీ ఇచ్చారు. తాజాగా రేవంత్ రెడ్డి సైతం పై విధంగా కేటీఆర్ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Next Story