- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Revanth: ప్రజా ప్రభుత్వం పని చేస్తుందనడానికి ఇదే నిదర్శనం.. సీఎం ఆసక్తికర ట్వీట్
దిశ, వెబ్ డెస్క్:ప్రజా ప్రభుత్వం(People Governance) బలమైన సంకల్పంతో పని చేస్తుందనడానికి రాష్ట్రానికి వచ్చిన ఎఫ్‌డీఐల నిదర్శనం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. రాష్ట్రానికి వస్తున్న ప్రత్యక్ష పెట్టుబడులపై ట్విట్టర్ వేదికగా స్పందించిన సీఎం.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రజా ప్రభుత్వ సంకల్పం.. రైజింగ్ తెలంగాణ(Rising Telangana) కల సాకారం అవుతోందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) సాధనలో రాష్ట్రం గర్వించదగ్గ వృద్ధిని సాధించిందని అన్నారు. అలాగే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెల నుండే దావోస్(Davos), అమెరికా(America), దక్షిణ కొరియా(South Koria) లాంటి దేశాల్లో పర్యటించి, పెట్టుబడుల సాధన కోసం చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. 2023 ఏప్రిల్- సెప్టెంబర్ తో పోల్చితే.. 2024 ఏప్రిల్- సెప్టెంబర్ అర్ధ సంవత్సరంలో అద్భుత లక్ష్యాలను సాధించామని, రూ.12,864 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సాధనతో, 33 శాతం వృద్ధిని నమోదు చేశామని వివరించారు. ఇక రాష్ట్రంలో యువత ఉపాధి - ఉద్యోగ కల్పనకు ప్రజా ప్రభుత్వం బలమైన సంకల్పంతో పని చేస్తుందనడానికి ఇది నిదర్శనమని, ఈ పురోగతి సాధనలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.