- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొత్త సంవత్సరం.. భక్తి పారవశ్యం..
దిశ, పాపన్నపేట : నూతన సంవత్సరం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. ఎటు చూసినా జనమే కనిపించారు. కొత్త సంవత్సరం అన్ని విధాల సంతోషాలతో సాగాలని జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వన దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు. ముందుగా అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న మంజీరా నదీపాయలు, చెక్ డ్యామ్ లో పుణ్యస్నానాలు ఆచరించి వనదుర్గమ్మ దర్శనానికి బారులు తీరారు.
రద్దీ అధికంగా ఉండటంతో దర్శనానికి చాలా సమయం పట్టింది. పలువురు భక్తులు వాహనాలకు పూజలు నిర్వహించారు. సంవత్సరమంతా సుఖసంతోషాలతో ఉండాలని, కోరిన కోరికలు తీర్చి చల్లంగా చూడమ్మా.. దుర్గమ్మ తల్లి అంటూ భక్తులు వేడుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి దీవించారు. ఆలయ ఈవో చంద్రశేఖర్, సిబ్బంది భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.