Talluru: ప్రేమ వ్యవహారంలో రెండు కుటుంబాల ఘర్షణ.. ఉద్రిక్తత

by srinivas |   ( Updated:2025-01-04 03:51:58.0  )
Talluru: ప్రేమ వ్యవహారంలో రెండు కుటుంబాల ఘర్షణ.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా(Ntr District)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వత్సవాయి మండలం తాళ్లూరు(Talluru)కు చెందిన యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. ఈ విషయం రెండు కుటుంబాలకు తెలిసింది. ఇదే క్రమంలో యువతి కనిపించలేదు. ఇందుకు యువకుడి కుటుంబ సభ్యులే కారణమంటూ యువతి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. యువతి కుటుంబ సభ్యులపై యువకుడి బంధువులు దాడి చేశారు. ఈ దాడుల్లో 6 కార్ల అద్దాలు ధ్వంసం కాగా ఇద్దరికి గాయాలయ్యాయి. తాళ్లూరు పీఎస్‌లో పరస్పరం ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు రెండు వర్గాలతో పోలీసులు మాట్లాడారు. గ్రామంలో చెలరేగిన ఉద్రిక్తతలను సద్దుమనిగించారు. రెండు కుటుంబాలు మరోసారి కూడా పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచించారు. ఎలాంటి దాడులకు దిగినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed