- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Nellore: ప్రైవేటు స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District) బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి(Penuballi)లో ప్రైవేటు స్కూల్ బస్సు(Private School Bus)కు తృటిలో ప్రమాదం తప్పింది. స్థానిక ప్రైవేటు స్కూలు బస్సు రోజు మాదిరిగా సోమవారం కూడా విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యలో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది దీంతో స్థానికులు వెంటనే సహాయ చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. వేరే మార్గంలో వెళ్లాల్సిందని, కానీ అటువైపు వెళ్లకుండా పొలాల వైపు రావడం వల్లనే ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.