Rohith Sharma: రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ కీలక ప్రకటన..

by Shiva |   ( Updated:2025-01-04 03:09:28.0  )
Rohith Sharma: రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ కీలక ప్రకటన..
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా (Team India) 2-1 తేడాతో వెనుకబడి ఉంది. అయితే, ఆడిన 3 మ్యాచ్‌లలో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma) బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే జట్టులోని సీనియర్ ఆటగాళ్ల ఫామ్‌పై డ్రెస్సింగ్ రూంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautham Gambhir) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు రోహిత్ శర్మను చివరి టెస్ట్‌ను తప్పించడం పట్ల ఆయన ఫ్యాన్స్ చిందులు తొక్కుతున్నారు.

ఏకంగా కోచ్ గౌతమ్ గంభీర్ ‘రిప్’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలోనే రోహిత్ శర్మ తన రిటైర్మెంట్‌ (Retirement) వార్తలపై కీలక ప్రకటన చేశాడు. తాను ఇంకా రిటైర్ కాలేదని తెలిపాడు. ఫామ్‌లో లేననే విషయాన్ని స్వయంగా తానే కోచ్ గౌతమ్ గంభీర్‌కు చెప్పానని అన్నారు. అందుకే సిడ్నీ టెస్ట్‌ (Sydney Test) తుది జట్టు నుంచి తప్పుకున్నానని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు నెట్స్‌లో తీవ్రంగా కష్టపడుతున్నానని తెలిపారు. తాను తీసుకుంది కఠినమైన నిర్ణయమే అయిన.. జస్ర్పీత్ బుమ్రా నాయకత్వం చాలా బాగుందని రోహిత్ కితాబిచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed