హాస్టల్లో యువకున్ని హత్య చేయించిన ఓనర్..

by Sumithra |
హాస్టల్లో యువకున్ని హత్య చేయించిన ఓనర్..
X

దిశ, మేడిపల్లి : మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో దారుణం చోటుచేసుకుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాయ్స్ హాస్టల్ లో దారుణ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పీర్జాదిగూడ మల్లికార్జున నగర్ లోని అనురాగ్ రెడ్డి బాయ్స్ హాస్టల్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ హత్యకు దారితీసింది. జనగాంకి చెందిన మహేందర్ రెడ్డి (38), హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ అనురాగ్ రెడ్డి హాస్టల్ లో ఉండేవాడు. హాస్టల్ ఓనర్ అయిన పద్మ (40కి మహేందర్ రెడ్డికి మధ్య గతంలో గొడవ జరగడంతో హాస్టల్ నుండి మహేందర్ రెడ్డి ఈ మధ్యనే వెళ్ళిపోయాడు. శుక్రవారం మహేందర్ రెడ్డిని పద్మ హాస్టల్ కి పిలవగా శనివారం ఉదయం 3.30 గంటలకు హాస్టల్ కు రాగ, అదే హాస్టల్ లో ఉండే కిరణ్ రెడ్డి (35) మహేందర్ రెడ్డిని హత్య చేశాడు.

హాస్టల్ ఓనర్ పద్మ, కిరణ్ రెడ్డిని పోలీసులు అదుపులో ఉన్నారని సమాచారం. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణం తెలియవలసి ఉంది. కేసు నమోదు చేసి, విచారణ చేసి వివరాలు తెలియజేస్తామని సీఐ గోవింద రెడ్డి తెలిపారు. మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి సంఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలు పరిశీలిస్తున్నారు. హత్యకు గల కారణం అక్రమ సంబంధమే అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హాస్టల్ లో ఎప్పుడు యువకులు మద్యం సేవించి ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారని ఇక్కడ నుండి హాస్టల్ ను తీసివేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed