- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాధపడతారని తెలిసినా పార్టీ మారక తప్పలేదు.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్
దిశ, జగిత్యాల ప్రతినిధి : బీఆర్ఎస్ నాయకులు కొంత బాధపడతారని తెలిసినా నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారక తప్పలేదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని పలు వార్డులలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉంటే నిధుల మంజూరుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే అన్ని అలోచించి పార్టీ మారినట్లు తెలిపారు. ఇక జగిత్యాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పటికే 100 కోట్లకు పైగా నిధులు నియోజకవర్గానికి మంజూరు అయినట్టు వివరించారు. పొరుగున ఉన్న జిల్లాలో, నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటమి పాలయిందని పక్కనే ఉన్న కోరుట్లతో చూసుకుంటే జగిత్యాలలో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఒక పార్టీకి వ్యతిరేకంగా తాను ఉండనని తనను గెలిపించిన వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. నాలాలను ఆక్రమించడం వల్లే వరద నీరు ఇళ్లలోకి చేరుతుందని హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు ప్రజల సౌకర్యం కోసమే అని ఎమ్మెల్యే అన్నారు. మోతే చెరువు అభివృద్ధి కై రెండు కోట్ల 80 లక్షలకు పైగా నిధులు మంజూరైనట్లు తెలిపిన ఎమ్మెల్యే నీటి శుద్ధి కోసం మరిన్ని ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. గతంలో చింతకుంట చెరువు సమీపంలో నిర్మించిన డ్రైనేజీ పనికి రాకుండా పోయిందని అధికారులు సరైన ప్రణాళికలతో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.