ఆ ఇద్దరు చిన్నారులకు సోకింది చైనా వైరస్సే.. ICMR అధికారిక ప్రకటన

by Mahesh |   ( Updated:2025-01-06 06:45:30.0  )
ఆ ఇద్దరు చిన్నారులకు సోకింది చైనా వైరస్సే.. ICMR అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రజలు భయపడినట్లుగానే చైనాలో విపరీతంగా వ్యాప్తిస్తున్న HMPV వైరస్ భారత్ లో ప్రవేశించింది. సోమవారం బెంగుళూరులో 8 నెలల చిన్నారికి ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ చిన్నారి తో పాటు మరో చిన్నారికి సంబంధించిన నమూనాలను తీసుకుని పరీక్షలు నిర్వహించగా.. వారికి సోకింది చైనా HMPV వైరస్సే అని తేల్చారు. కాగా సదరు పరీక్షలను మరోసారి ICMR పరిశీలించి.. బెంగుళూరులోని ఇద్దరు చిన్నారులకు సోకింది.. HMPV వైరస్ అని అధికారికంగా ప్రకటించింది. అయితే ఇద్దరు చిన్నారులకు ఎటువంటి అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన రికార్డు లేకపోయినప్పటికి ఈ వైరల్ ఎలా సోకిందన్న దానిపై ఆందోళన నెలకొంది. భారత్‌లోకి చైనా కొత్త వైరస్ ఎంటర్ కావడంతో దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ లక్షణాలు

హెచ్ఎంపీవీ (HMPV) వైరస్‌ని 2001లోనే గుర్తించిన గుర్తించారు. ఆ వైరస్ లక్షణాలు (HMPV virus Symptoms) ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియా కు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ అని పేర్కొంది. ఈ వ్యాప్తిని నిరోధించడానికి చేతులు శుభ్రంగా కడుక్కోవాలని.. అనారోగ్యంతో ఉన్న వారితో కాంటాక్ట్ లో ఉండొద్దని డాక్టర్ల సూచించారు.

Advertisement

Next Story