- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పరిహారం ఇప్పించండి సారు..
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : రాజరాజేశ్వర (మిడ్ మానెరు) జలాశయంలో కోల్పోయిన భూమికి పరిహారం అందించాలని ఓ బాధితుడు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేశాడు. జిల్లాలోని తంగల్లపల్లి మండలం చింతల్ ఠాణా గ్రామానికి చెందిన కొలువురి నర్సయ్య తన తండ్రికి చెందిన సర్వే నెంబర్ 141/3 లో 10 గుంటల భూమి ఉంది.
ఆ భూమి మధ్య మానెరు ప్రాజెక్టు నిర్మాణంలో కోల్పోయారు. అయితే ఆ భూమికి సంబంధించిన రూ. 2 లక్షల 16 వేల పరిహారం ఇంత వరకు బాధితుడికి అందలేదు. కాగా 2017లో బాధితుడికి అందవలసిన చెక్కు అధికారుల తప్పిదం వల్ల ఇతరులకు చేరింది. తనకు రావలసిన పరిహారం చెక్కు ఇతరులకు అందిందని గత ఏడేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని, 15 సార్లు ప్రజావాణిలో మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లా కలెక్టర్ స్పందించి తనకు రావలసిన పరిహారం అందించి, తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.